ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజమహేంద్రవరంలో 'లలితా జ్యూయలర్స్' - opens

"అతి తక్కువ సమయంలోనే లలితా జ్యూయలర్స్ వినియోగదారుల ఆదరాభిమానాలు పొందింది. సంస్థ అధినేత కిరణ్ కుమార్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారు." ఆర్థికమంత్రి యనమల

లలిత జ్యూయలర్స్

By

Published : Mar 10, 2019, 2:14 PM IST

లలిత జ్యూయలర్స్

ప్రముఖ ఆభరణాల సంస్థ లలితా జ్యూయలర్స్ 21వ షోరూంను రాజమహేంద్రవరంలో ప్రారంభించింది. దేవీచౌక్ సమీపంలోని కంబాలచెరువు వద్ద ఏర్పాటుచేసిన షోరూంను ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. అతి తక్కువ కాలంలోనే ఈ సంస్థ వినియోగదారుల ఆదరాభిమానాలు పొందిందని మంత్రులు అభిప్రాయపడ్డారు. సంస్థ అధినేత కిరణ్ కుమార్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని యనమల అన్నారు. నమ్మకమే పెట్టుబడిగా వినియోగదారులకు చేరువయ్యేందుకు మరింత కృషి చేస్తామని సంస్థ అధినేత తెలిపారు. ఎంపీ మురళీమోహన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details