తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో కోళ్ల ఫారాలు అధికంగా ఉన్నాయి. కాలంతో సంబంధం లేకుండా ఉంటున్న వేడి కారణంగా.. కోళ్లు ఎక్కువగా చనిపోయేవి. ఫలితంగా.. ఫారాల నిర్వాహకులు పెద్ద మొత్తంలో నష్టపోయేవాళ్లు. సమస్యను పరిష్కరించుకోవడానికి.. ఫారాల నిర్వాహకులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. పర్యావరణాన్ని మార్గంగా ఎంచుకున్నారు. ఫారం షెడ్లపై పాదులను పెంచి చల్లదనం ఉండేలా ఏర్పాటు చేశారు. ఫలితంగా.. కోళ్లు వేడిని తట్టుకుని చనిపోకుండా ఉంటున్నాయని యజమానులు చెప్పారు. ఒకప్పుడు బ్యాచ్‌కి 50 వేల ఆదాయం రాగా.. ఇప్పుడు లక్ష వరకూ సంపాదిస్తున్నామని ఆనందిస్తున్నారు.
కోళ్ల ఫారాలపై పాదుల పెంపకం... ఇదే అసలు విషయం! - తూర్పుగోదావరి జిల్లా మెట్టప్రాంతంలో కోళ్లఫారాలు
వ్యాపారం చేయాలంటే డబ్బుతో పాటు మంచి ఆలోచన విధానం కావాలి. సమస్యకు కారణం అర్థం చేసుకోవడమే కాక.. పరిష్కారాన్నీ ఆలోచించగలగాలి. సరిగ్గా ఇదే సూత్రాన్ని అమల్లో పెట్టి విజయవంతమయ్యారు... తూర్పు గోదావరి జిల్లాలోని పలువురు కోళ్ల ఫారం యజమానులు.
కోళ్ల ఫారలాపై పాదులు... ఇందుకేనట!