కరోనా కాలంలో అత్యవసర సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మాస్కులు, గ్లౌజులతోపాటు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వారికందిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి మూలపేటలో తయారుచేసిన దుస్తులను పంచాయతీ కార్యదర్శి రమణ అందజేశారు.
పారిశుద్ధ్య సిబ్బందికి 'మూలపేట' దుస్తుల కిట్ - పారిశుద్ధ్య సిబ్బందికి 'మూలపేట' దుస్తుల కిట్
కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే అత్యవసర సేవల సిబ్బంది విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. వారిలో పారిశుద్ధ్యం కార్మికులు ఒకరు. వారు బయట పనులు చేస్తున్న కారణంగా వారి రక్షణ దృష్ట్యా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
పారిశుద్ధ్య సిబ్బందికి 'మూలపేట' దుస్తుల కిట్