తూర్పు గోదావరి జిల్లా తునిలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కంటైన్మెంట్ నుంచి కొన్ని సడలింపులు ఇచ్చి దుకాణాలు తెరుచుకునేందుకు వ్యాపారులు సిద్దమవుతున్న సమయంలో 43 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ నిర్దరణ అయ్యింది. దీంతో ఆంక్షలు యధాప్రకారమే కొనసాగనున్నాయి. విజయవాడ నుంచి వచ్చిన ఆ వ్యక్తి కి అనారోగ్యంగా ఉండటంతో స్థానికంగా ఉన్న బంధువులు అశ్రయం ఇవ్వలేదు. దీంతో స్థానిక మెయిన్ రోడ్డులో ఆలయ సమీపంలో ఓ గదిలో ఉన్నాడని అధికారులు గుర్తించారు. బాధితుడుతో మాట్లాడి ఎవరెవరితో కలిసాడో వివరాలు తెలుసుకుంటున్నారు. కొంత మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
తునిలో మరోసారి అలజడి.. కొనసాగనున్న ఆంక్షలు - tuni containment zone
తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో కంటైన్మెంట్ ఆంక్షలు తొలగిపోతాయనుకున్న క్రమంలో తాజాగా మరో పాజిటివ్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో ఆంక్షలు యధాతథంగా అమలు చేయనున్నారు.
తునిలో మరోసారి అలజాడి.. కొనసాగనున్న ఆంక్షలు
Last Updated : May 25, 2020, 8:28 PM IST