ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లయిన మూడు రోజులకే వధువు ఆత్మహత్య - ఏడిద సీతానగరంలో నవ వధువు ఆత్మహత్య

కాళ్ల పారాణి ఆరలేదు.. తోరణాలు వాడలేదు. సందళ్లు ఆగలేదు.. సంబరాలకు సరిలేదు. నవ జంట నిండు నూరేళ్లూ ఆనందంగా జీవించాలని అందరి ఆకాంక్ష. ఊహించని దరిమిలా నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం ఆ ఇంట అంతులేని విషాదాన్ని నింపింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ఏడిద సీతానగరంలో జరిగింది.

new bride suicide in eedida sithanagaram east godavari district
పెళ్లయిన మూడు రోజులకే వధువు ఆత్మహత్య

By

Published : Aug 1, 2020, 10:44 AM IST

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద సీతానగరానికి చెందిన మహాదాసు రమ్య శ్రీదేవికి 3 రోజుల కిందట పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణపురం గ్రామంలో ఉంటున్న మేనమామతో వివాహమైంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఆమె ఎలుకల మందు తింది. అస్వస్థతకు గురైన శ్రీదేవిని మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. దీంతో పెళ్లింట విషాదం అలుముకుంది.

ఉన్నత చదువులు చదివేందుకు కుదరదనే బాధతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని బంధువులు భావిస్తున్నారు. తహసీల్దారు నాగలక్ష్మి వివరాలు నమోదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details