తూర్పుగోదావరి జిల్లా తుని ఆర్టీసీ డిపోలో కరోనా నివారణ చర్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రయాణికులకు థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే అనుమతించేలా ప్రణాళికలు చేసినా కార్యరూపం దాల్చడం లేదు. శానిటైజర్లు నాణ్యమైనది ఇవ్వడం లేదని సంస్థ సిబ్బంది ఆరోపిస్తున్నారు.
ఆర్టీసు డిపోలో నిర్లక్ష్యం.. స్కానింగ్ లేకుండానే ప్రయాణాలు - తునిలో కోరనా కేసులు
తూర్పుగోదావరి జిల్లా తుని ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల ఆరోగ్య భద్రతను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ.. ప్రయాణికులకు థర్మల్ స్కానింగ్ నిర్వహించకుండానే అనుమతి ఇస్తున్నారు.
తుని ఆర్టీసీ డిపోలో నిర్లక్ష్యం
థర్మల్ స్కానింగ్ చేయడానికి ఇంకా పరికరాలు అందుబాటులోకి రాలేదని.. డిపో మేనేజర్ పద్మావతి అన్నారు. శానిటైజర్లు నాణ్యమైనది కాదని అపోహ మాత్రమేనని పద్మావతి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: వాలంటీర్ వేధింపులు.. మాజీ మంత్రి కారు డ్రైవర్ ఆత్మహత్య