తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో దుర్గాదేవి నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో దుర్గాదేవి ఆలయం ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. ప్రత్తిపాడు పుల్లపువీధిలో మహిళలు నవరాత్రులలో భాగంగా ప్రతిరోజూ అత్యంత భక్తిశ్రద్ధలతో భజనలు చేశారు. ఏలేశ్వరం మండలం లింగవరం కాలనీలో దుర్గాదేవి ఆలయంలో పెద్దఎత్తున మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దశమి సందర్భంగా అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు - ఏలేశ్వరంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలో ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దుర్గాదేవి ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు