తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీలో కలెక్టర్, ఎస్పీతో సహా విద్యార్థులు పాల్గొన్నారు. 18 ఏళ్లు నిండి ఓటు హక్కు పొందిన వారికి గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం అధికారులు, విద్యార్థులతో....కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
యానాంలో....
కేంద్రపాలిత ప్రాంతం యానాంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఓటు హక్కు పొందిన వారిని ఉద్దేశించి కేంద్ర ఎన్నికల అధికారి సునీల్ అరోరా ఇచ్చిన సందేశాన్ని వీక్షించారు. ఈ ఏడాది జనవరికి 18 ఏళ్లు పూర్తై ఓటు హక్కు పొందిన వారికి యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా గుర్తింపు కార్డులు అందజేశారు. అనంతరం వారితో విధిగా ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ముమ్మిడివరంలో అధికారులు, ఎన్నికల సిబ్బంది జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి: ఇంజినీరింగ్ విద్యార్థులకు విస్తృత అవకాశాలు