జాతీయ క్రీడా దినోత్సవాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ అటానమస్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్ధులు కేవలం చదువులోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం సంపాదించాలని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. 130 కోట్లు జనాభా ఉన్న భారత్‌కు ఒలింపిక్స్‌లో పతకాలు రావడం లేదని, విద్యార్ధులు క్రీడా రంగంలో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలని ఆయన కోరారు. అనంతరం కోటిపల్లి నూతనంగా నిర్మించిన మోడల్ బస్‌షెల్టర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి భవాని, నగర పాలక సంస్థ కమీషనర్ సుమిత్‌కుమార్ గాంధీలు పాల్గొన్నారు.
ఒలంపిక్స్ లక్ష్యంగా విద్యార్దులు పోటీపడాలి:ఎమ్మెల్యే గోరంట్ల - rajamahendravaram
రాజమహేంద్రవరం ప్రభుత్వ అటానమస్ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ముఖ్యఅతిధిగా విచ్చేశారు.
national sports day celebrations in rajamahendravaram in eastgodavari districtnational sports day celebrations in rajamahendravaram in eastgodavari district