వర్చువల్ పద్ధతిలో లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరిస్తున్నామని జ్యుడీషియల్ కోర్టు మెజిస్ట్రేట్ పి. రాజశేఖర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం స్థానిక కోర్టులో జాతీయ లోక్ అదాలత్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 కేసులు రాజీ చేసినట్టు మెజిస్ట్రేట్ తెలిపారు. ముద్దాయిలు, కక్షిదారులు సంబంధిత పోలీస్స్టేషన్లకు వెళ్లి దూరదృశ్య సమావేశం ద్వారా హాజరవుతున్నట్లు చెప్పారు.
రంపచోడవరంలో జాతీయ లోక్ అదాలత్ దినోత్సవం
జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీకి అనుకూలమైన కేసులకు పరిష్కారం చూపిస్తున్నామని జ్యుడీషియల్ కోర్టు మెజిస్ట్రేట్ పి. రాజశేఖర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం స్థానిక కోర్టులో జాతీయ లోక్ అదాలత్ దినోత్సవాన్ని నిర్వహించారు.
జాతీయ లోక్ అదాలత్
రంపచోడవరం, అడ్డతీగల కోర్టుల పరిధిలోని పదకొండు మండలాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. గతంలో లోక్ అదాలత్‌లను నేరుగా కోర్టులో నిర్వహించేవారు. కొవిడ్ కారణంగా ఆన్లైన్ ద్వారా సమావేశమవుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ప్రకాశ్, శ్రీనివాస్, భగవాన్, సంతోషకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కొత్తపేట కెనరా బ్యాంకులో.. మరో 20 కాసుల బంగారం మాయం!