తూర్పుగోదావరి జిల్లాకు 2018-19 జాతీయ పశుగణ వివరాలు వచ్చాయని సంయుక్త సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో ఆవుల సంఖ్య 3.96 లక్షలు, గేదెలు 5.85 లక్షలు ఉన్నాయన్నారు. ఇవి కాకుండా గొర్రెలు 3.16 లక్షలు, మేకలు 3.18 లక్షలు, పెంపుడు కుక్కలు 64 వేలు, కోళ్లు 1.82 కోట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జిల్లాలో ఏడాదికి 14.77 లక్షల మెట్రిక్ టన్నల పాల ఉత్పత్తి సాధించాల్సి ఉండగా... 15 లక్షల మెట్రిక్ టన్నులు సాధించామన్నారు. రాష్ట్రస్థాయిలో ఈ విషయంలో నాలుగో స్థానంలో ఉందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
'రాష్ట్రస్థాయి పాల ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉన్నాం'
జాతీయ పశుగణన ప్రకారం తూర్పుగోదావరి జిల్లాలో 9.91 లక్షల పశువులు ఉన్నాయని పశుసంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వాస్తవానికి జనవరిలో 2018-19 జాతీయ పశు గణన వివరాలు రావాల్సి ఉండగా... కొవిడ్ కారణంగా ఆలస్యమైందని ఆయన చెప్పారు.
జాతీయ పశుగణన వెల్లడి