ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 28, 2022, 5:04 AM IST

Updated : Mar 28, 2022, 6:43 AM IST

ETV Bharat / state

ఘనంగా ముగిసిన జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు

National Cultural Mahotsav: రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన జాతీయ సాంస్కృతిక మహోత్సవం ఘనంగా ముగిసింది. కళాకారుల ఆటపాటలతో గోదావరి తీరంలో సందడి చేశారు. భారతీయ, సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్‌ తరాలకు అందించేలా ఆడిపాడారు. ఈ కార్యక్రమాలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ప్రముఖ నటి జయప్రదతో పాటు ప్రముఖులు హాజరయ్యారు.

National Cultural Mahotsav
National Cultural Mahotsav

National Cultural Mahotsav: రాజమహేంద్రవరంలోని ప్రభత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రెండు రోజులపాటు ఘనంగా నిర్వహించిన జాతీయ సంస్కృతి వేడుకలు ముగిశాయి. ముగింపు వేడుకలకు ప్రముఖ నటి జయప్రద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమహేంద్రవరంను సంస్కృతీ కేంద్ర బిందువుగా తీర్చి దిద్దాలని జయప్రద అభిప్రాయపడ్డారు. గొప్ప చరిత్ర, సంస్కృతి, భిన్నజాతుల నిలయమైన భారత్‌లో జాతి ఐక్యతకు సంస్కృతి మహోత్సవాలు దోహదం చేస్తాయని ప్రజాప్రతినిధులు అన్నారు. అనంతరం 300 మంది కళాకారులు చేసిన వివిధ రాష్ట్రాల నృత్య, వాద్య కళా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. గంగాధర శాస్త్రి భగవత్ గీతా శ్లోకాలు, సినీ నేపథ్య గాయకులు వివిధ చిత్రాల పాటలు ఆలపించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శకులు అధిక సంఖ్యలో తిలకించారు.

2015 నుంచి కేంద్రం ఆయా రాష్ట్రాల్లో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుండగా...ఈ ఏడాది రాజమహేంద్రవరానికి అవకాశం దక్కింది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో.. దేశ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా సెట్టింగులు, ఆయా రాష్ట్రాల కళా రూపాలు ప్రదర్శించారు. ఈ మహోత్సవంలో వెయ్యి మంది జాతీయ స్థాయి కళాకారులు ప్రదర్శనలతో సందడి చేశారు.

ఘనంగా ముగిసిన జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు

ఇదీ చదవండి:మెరిసిన విమానాలు.. మురిసిన జనాలు.. ఆకట్టుకున్న ఎయిర్​ షో..!

Last Updated : Mar 28, 2022, 6:43 AM IST

ABOUT THE AUTHOR

...view details