లోక్‌సభ మాజీ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి కారణజన్ముడని తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్ అన్నారు. బాలయోగి జయంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని ఆయన ఘాట్ వద్ద లోకేశ్ నివాళులర్పించారు. అనంతరం యువనేతను తెదేపా నేతలు సత్కరించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన చేస్తున్నారని లోకేశ్ ఆక్షేపించారు. ఈ కార్యక్రమానికి వస్తుండగా నారా లోకేశ్‌కు అంబాజీపేటలో తెదేపా శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.
బాలయోగి కారణ జన్ముడు: నారా లోకేశ్ - tdp
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని లోక్‌సభ మాజీ సభాపతి బాలయోగి ఘాట్ వద్ద తెదేపా యువ నేత నారా లోకేశ్ నివాళులర్పించారు.
![బాలయోగి కారణ జన్ముడు: నారా లోకేశ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4613871-208-4613871-1569926125014.jpg)
బాలయోగి కారణజన్ముడు: నారా లోకేశ్
Last Updated : Oct 1, 2019, 11:55 PM IST