ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాదయాత్రలో తెదేపా నేతకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు - పాదయాత్రలో పాల్గొన్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే

Nallamilli Ramakrishna Reddy: అమరావతి రైతుల పాదయాత్రలో తెదేపా నేత నల్లమిల్లి రామకృష్టారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. అనుచరులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Nallamilli Ramakrishna Reddy
అస్వస్థతకు గురైన నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి

By

Published : Oct 20, 2022, 5:45 PM IST

Ramakrishna Reddy falls ill: అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రలో పాల్గొన్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వడదెబ్బ తగిలింది. రామకృష్ణ రెడ్డి ఎండవేడికి స్పృహ తప్పి పడిపోయారు. ఆయనను అనుచరులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నల్లమిల్లి గత మూడు రోజులుగా జ్వరంతో భాదపడుతున్నారు. రైతుల పాదయాత్ర తన నియోజకవర్గంలో ఉండడంతో అనారోగ్యంతోనూ వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. మధ్యాహ్న సమయంలో పాదయాత్ర అనపర్తికి చేరడం... ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో నల్లమిల్లి అస్వస్థతకు గురయ్యారు.

ABOUT THE AUTHOR

...view details