తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం చేశారు. అమలాపురం సబ్ కలెక్టర్ కౌశిక్.. ప్రెసిడెంట్ అధికారిగా వ్యవహరించి ఈ కార్యక్రమం నిర్వహించారు. వైకాపాకు చెందిన 14 మంది, తెదేపాకు చెందిని ఆరుగురు కౌన్సిలర్లతో కమిషనర్ నాగేంద్ర కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. 11వ వార్డు సభ్యుడైన కమిడి ప్రవీణ్ కుమార్ను ఛైర్మన్గా.. మూడో వార్డు సభ్యురాలైన రెడ్డి హేమసుందరిని వైస్ ఛైర్మన్గా సభ్యులు ఎన్నుకున్నారు. వారిని స్థానిక శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీశ్, సబ్ కలెక్టర్, కమిషనర్ ఇతర అధికారులు సత్కరించారు.
ముమ్మిడివరం నగర పంచాయతీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం - amalapuram sub collector news
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం సబ్ కలెక్టర్, స్థానిక శాసనసభ్యుడు పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారం