తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకల వద్ద దివిస్ ఫార్మా పరిశ్రమపై 10 రోజుల్లో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని జనసేన డిమాండ్ చేసింది. లేదంటే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్వయంగా వచ్చి పోరాటం కొనసాగిస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఓట్లు వేసి గెలిపించిన దళితులు, మత్స్యకారులపై కేసులు పెట్టడం దారుణమని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'దివిస్ ఫార్మాపై నిర్ణయం తీసుకోకపోతే.. పవన్‌కల్యాణ్ పోరాటం చేస్తారు' - దివిస్ వివాదంపై జనసేన వ్యాఖ్యలు
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకల వద్ద దివిస్ ఫార్మా పరిశ్రమపై 10 రోజుల్లో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. లేదంటే పవన్ కల్యాణ్ స్వయంగా వచ్చి పోరాటం చేస్తారని అన్నారు.
దివిస్ పరిశ్రమపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన మాటను.. సీఎం జగన్ తప్పారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. దివిస్ గోడలు బద్దలు కొట్టండని 2018 పాదయాత్ర సందర్భంగా జగన్ అన్నారని.. ఇప్పుడు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అరోపించారు. గతంలో కేటాయించిన భూమికి అదనంగా 182 ఎకరాలు వైకాపా ప్రభుత్వం కేటాయింపులు జరిపిందని అన్నారు. 75 శాతం ఉపాధి స్థానికులకు కేటాయించాలని పరిశ్రమల మంత్రి చెబుతున్నారని.. 900 ఉద్యోగాల కోసం 700 ఎకరాల భూమిని అప్పగిస్తున్నారని నాదెండ్ల మనోహర్ దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: మిషన్ బిల్డ్ ఏపీ కేసు: హైకోర్టులో విచారణ 28కి వాయిదా