దివిస్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయకపోతే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చి పోరాడతారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. దివిస్ ప్రతిపాదిత ప్రాంతం కొత్తపాకలలో ఆయన పర్యటించి అనంతరం సభలో మాట్లాడారు. దివిస్ విషయమై పవన్ కల్యాణ్.. తమ పార్టీ నాయకులతో ఇప్పటికే చర్చించారన్నారు. దివిస్కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి జనసేన అండగా ఉంటుందని నాదెండ్ల భరోసా ఇచ్చారు.
'దివిస్పై 10 రోజుల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి' - దివీస్ పరిశ్రమపై నాదెండ్ల మనోహర్ కామెంట్స్
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకల వద్ద దివిస్ ఫార్మా పరిశ్రమ విషయంలో 10 రోజుల్లో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. దివిస్కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి జనసేన అండగా ఉంటుందన్నారు.
nadendla manohar on divis Industry