ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు-నేడు పనులపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆగ్రహం - Education Officer inspection in P. Gannavaram

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులపై ప్రిన్సిపల్ సెక్రటరీ పి.రాజశేఖర్ అసహనం వ్యక్తం చేశారు. ఈనెల 16న.. సీఎం జగన్​ పర్యటించనున్న నేపథ్యంలో.. పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను ఆయన పర్యవేక్షించారు.

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పి.రాజశేఖర్
Education Chief Secretary P. Rajasekha

By

Published : Aug 11, 2021, 7:23 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. నాడు-నేడు పనులపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పి.రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 16న.. సీఎం జగన్‌ పర్యటించనున్న నేపథ్యంలో.. నాడు-నేడు పనులను రాజశేఖర్‌ పరిశీలించారు. 65 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశామని.. టైల్స్ నాణ్యతగా లేవని, మార్చాలని ఆదేశించారు.

రంగులు కూడా నాణ్యతగా లేవంటూ.. ఇంజనీరింగ్ అధికారులపై రుసరుసలాడారు. కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ కీర్తి ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. రాజశేఖర్‌ వెంట ఉన్నారు.

ఇదీ చదవండీ..CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,869 కరోనా కేసులు..18 మరణాలు

ABOUT THE AUTHOR

...view details