కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని ముస్లిం సంఘాలు ఆరోపించాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆజాద్ చౌక్ వద్ద ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వివిధ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చివేసేలా ఈ బిల్లు ఉందన్నారు. వెంటనే బిల్లును రద్దు చేయాలని లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం'
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాజమహేంద్రవరం ఆజాద్ చౌక్ వద్ద వివిధ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఈ బిల్లు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉందని నేతలు ఆరోపించారు.
muslim unions protest in rajamahendravaram