భార్యను తనకు దూరం చేసిందనే అనుమానంతో.. సొంత అక్కపై పెట్రోలు పోసి తమ్ముడు నిప్పంటించడం.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సూర్యనారాయణపురంలో కలకలం రేపింది. బొర్రా మోహన్ బాబు అనే వ్యక్తి.. తన అక్క కుమారిపై పెట్రోల్‌తో దాడి చేశాడు. తన భార్యను దూరం చేసిందనే కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలు కుమారిని.. చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.
బాధితురాలికి 75 శాతం గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. పెట్రోల్ దాడిచేసి పారిపోతున్నమోహన్ బాబును.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కారణం అక్కేనని..
మోహన్ బాబు, అతని భార్యకు మధ్య గొడవలు జరిగాయి. ఆ వివాదాలతో వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే.. భార్య తనను వీడి వెళ్లిపోవడానికి అక్క కుమారి కారణమని భావించిన మోహన్ బాబు.. పలుమార్లు గొడవపడ్డాడు.