అమలాపురంలో 6 వార్డులు ఏకగ్రీవం
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా మొదలైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని సద్వినియోగం చేసుకుంటున్నారు. మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను 6 వార్డులు ఏకగ్రీవమయ్యాయి 24 వార్డులకు సంబంధించి మొత్తం 32, 040 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు .
అమలాపురంలో మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి, అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్ష్ కౌశిక్ పరిశీలించారు. చేకూరి కీర్తి ఓటర్లతో కాసేపు మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆమె అన్నారు.
తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప ఓటు
నిమ్మకాయల చినరాజప్ప సతీసమేతంగా అమలాపురం మున్సిపాలిటీలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఐదవ వార్డులోని ఒకటో పోలింగ్ కేంద్రంలో రాజప్ప సతీమణి అనురాధ సోదరుడు జగ్గయ్య నాయుడు ఓటేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా విజయం సాధిస్తుందని... ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైకాపా అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.
ఉదయం 9 గంటలకు 17 శాతం పోలింగ్ .
అమలాపురం 15 వ వార్డులో మాజీ శాసనసభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం 9 గంటలకు పట్టణంలో 17 శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. శాంతియుతంగా ప్రజలు ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళలు ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు
9 గంటల సమయానికి 5 శాతం పోలింగ్
ముమ్మిడివరం నగర పంచాయతీ 19 వార్డులకు జరుగుతున్న పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కోవిడ్ నిబంధనను అనుసరించి ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీన్.. శానిటైజర్ చేస్తూ పోలింగ్ బూత్‌లోకి అనుమతిస్తున్నారు. 9 గంటల సమయానికి 5 శాతం ఓటింగ్ నమోదయ్యింది.