తూర్పుగోదావరి జిల్లా తుని పురపాలక సంఘం కార్యాలయం రికార్డుల్లో తప్పుడు లెక్కలు నమోదు చేయడం వల్ల ఉద్యోగులకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కొన్నేళ్ల క్రితం పలువురు ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా సుమారు రూ. 6 లక్షలు లెక్కల్లో తేడాలు కనిపించినట్లు అకౌంట్స్ విభాగం సిబ్బంది గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరం పురపాలక ఆర్డీ రవీంద్ర బాబు పలువురికి నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
తుని పురపాలక సంఘంలో తప్పుడు లెక్కలు గుర్తింపు
తుని పురపాలక సంఘం కార్యాలయంలో కొన్నేళ్ల క్రితం జరిగిన తప్పుడు లెక్కలను అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు తెలిపారు. సుమారు రూ. 6 లక్షలు లెక్కల్లో తేడాలను అకౌంట్స్ విబాగం సిబ్బంది కనిపెట్టారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీంతో ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న, గతంలో పని చేసి ఉద్యోగ విరమణ చేసిన వారిలో ఆందోళన నెలకొంది.
తుని పురపాలక సంఘం కార్యాలయంలో అవకతవకలు