పురపాలక ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జనసేన విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం నేత నిమ్మకాయల చినరాజప్ప.. తమ పార్టీ అభ్యర్థును గెలిపించాలని కోరారు.
ఎన్నికల ప్రచారజోరు.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులు - ఏపీ తాజా వార్తలు
పురపాలక ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం కొనసాగుతోంది. ఇంటింటికీ తిరుగుతూ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రత్యర్థులను విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు.

municipal elections
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలో మిత్రపక్షాలు బలపరిచిన 41వ డివిజన్ అభ్యర్థి విజయ భారతి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కంకి కొడవలి గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
ఇదీ చదవండి:వీళ్లు పగటి వేషగాళ్లు.. జనం ముందు బుకాయిస్తున్నారు: చంద్రబాబు