ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ దారి పూల దారి.. హాయిగా సాగిపోవోయి బాటసారి - godavari bridge News today

నిత్యం మనం తిరిగే ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను అంతగా పట్టించుకోం.. వేరే ప్రాంతాల వాటికి మాత్రం ఇట్టే ఆకర్షితులవుతాం. మన చుట్టూ ఉన్న అందాలను మన రెండు కళ్లతోనే కాకుండా కెమెరా కళ్లతోనూ చూస్తే ఇంత అందమైన ప్రదేశంలో ఉన్నామా అని ఆశ్చర్యపోవడం అతిశయోక్తి కాదు. ఆ కోవకు చెందిందే ఈ జాతీయ రహదారి.

ఈదారి పసుపు పూల దారి.. సాగిపోవోయి బాటసారి
ఈదారి పసుపు పూల దారి.. సాగిపోవోయి బాటసారి

By

Published : Apr 14, 2021, 7:37 PM IST

ఈదారి పసుపు పూల దారి.. సాగిపోవోయి బాటసారి

తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం ఎదుర్లంక బాలయోగి వారధి నుంచి కొమరగిరి వైపు సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా పచ్చని ఆకుల మధ్య పసుపు పూలతో బాటసారులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి.

రమణీయంగా గౌతమి నదిపై వారధి..

జాతీయ రహదారికి ఇరువైపులా ఉండే ఈ చెట్లు.. అమలాపురం, కాకినాడ వైపు ప్రయాణించే వాహనదారులు వీటి నీడన కొద్దిసేపు సేదతీరి స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తున్నారు. నేల మీద నుంచే ఇంత అందంగా ఉంటే గగనవీధుల్లో నుంచి పచ్చని పంట పొలాలు.. కొబ్బరి తోటల మధ్య రహదారి.. గౌతమి గోదావరి నదిపై వారధి ఇంకెంత రమణీయంగా ఉంటుందో మీరే వీక్షించండి.

ఇవీ చూడండి : ఉపరితల ద్రోణి ప్రభావం.. రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం !

ABOUT THE AUTHOR

...view details