తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వద్ద.. జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి అమలాపురం వైపు వస్తున్న కారు... రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిద్దరూ ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమారుడు సుమంత్, మేనల్లుడు లోకేశ్గా గుర్తించారు. ఎమ్మెల్యే కుమారుడికి స్వల్ప గాయాలు కాగా, మేనల్లుడి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరినీ పోలీసులు కాకినాడ ఆపోలో ఆసుపత్రికి తరలించారు.