తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం పంచాయతీకి... ‘నేషనల్ చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ’ పురస్కారం దక్కింది. అంగన్‌వాడీ కేంద్రాల సక్రమ నిర్వహణ, పిల్లలకు పౌష్టికాహారం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు మేలైన కృషి చేసినందుకు రాష్ట్రంలో తమ పంచాయతీకి ఈ అవార్డు లభించినట్లు కార్యదర్శి యు.రేణుక తెలిపారు. జాతీయ స్థాయి అవార్డు లభించడం పట్ల పలువురు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
మూలస్థానం అగ్రహారానికి జాతీయ పురస్కారం - మూలస్థానంకి చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామపంచాయితీ అవార్డు
మూలస్థాన అగ్రహారం గ్రామం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించింది. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి పనులపై సమగ్ర సర్వే నిర్వహించి... 'నేషనల్ చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామపంచాయితీ' అవార్డును ప్రకటించింది.
mulasthanam got Child Friendly Gram Panchayat Award in east godavari