తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం ములగపూడిలో టవర్ నిర్మాణ వివాదంలో 23 తేదీన సూసైడ్ నోట్ రాసి పరారైన అప్పలనాయుడుని ... ఈ రోజు గౌరీంపేట సమీపంలోని అచ్చంపేట వద్ద పోలీసులు పట్టుకున్నారు. బంగారయ్యపేట ఏలేరు కాలువ వద్ద తన ద్విచక్ర వాహనం వదిలి సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా పోయాడు. వైద్యం కోసం అతన్ని రౌతులపూడి ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజులు క్రితం అప్పలనాయుడు, శివగణేష్ కుటుంబాల మధ్య టవర్ నిర్మాణంలో ఘర్షణ జరిగింది. అప్పలనాయుడు స్థలంలో శివ గణేష్ అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం చేపట్టినట్లు బాధితుని కుటుంబం ఆరోపించింది. ఈ ఘర్షణలో అప్పలనాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకొని కొట్టినట్లు ఆయన భార్య భవాని ఆరోపించింది.
సూసైడ్ నోట్ రాసి పరారైన వ్యక్తి ఆచూకీ లభ్యం - ములగపూడి సూసైడ్ సెల్ఫీ వీడియో
టవర్ నిర్మాణ స్థల వివాదంలో 23 తేదీన సెల్ఫీ వీడియో తీసి.... సూసైడ్ నోట్ రాసి పరారైన తూర్పుగోదావరిజిల్లా రౌతులపూడి మండలం ములగపూడికి చెందిన అప్పలనాయుడిని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. మరో వైపు ఈ ఘటనలో తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని కొట్టినట్లు.. భార్య భవానీ ఆరోపించింది.
ములగపూడిలో టవర్ బాధితుడు