ప్రధానమంత్రి మోదీకి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. రైతులు చేస్తున్న ఉద్యమంపై పెద్ద మనసుతో ఆలోచించాలని కోరారు. రైతు పండించిన పంటను అమ్ముకునే సమయంలో.. బాధలు చెప్పుకోలేనివని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేస్తే బాగుంటుందని వివరించారు. బలవంతంగా రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేయటం సరికాదన్నారు. అన్నదాతకు అండగా నిలిచేలా నిర్ణయాలు తీసుకుంటారని ఆకాంక్షిస్తున్నట్లు లేఖలో ప్రస్తావించారు.
ప్రధాని మోదీకి ముద్రగడ పద్మనాభం లేఖ - దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలు
రైతుల ఆందోళనల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు కిందికి దిగితే బాగుంటుందని ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ మేరకు దేశ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అన్నదాతకు అండగా నిలిచేలా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు.
mudragada padmanabham