మాదిగల సమావేశంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ మాట్లాడిన తీరును.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండించింది. మాదిగల హక్కుల సాధన కోసం గుంటూరులో నిర్వహించిన సమావేశం మీద.. సీబీ సీఐడీ విచారణ జరిపించాలని ఆయన వ్యాఖ్యానించారు.
కారెం శివాజా వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ మండిపాటు - కారెం శివాజీ వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మార్పీఎస్ నేత ఆకుమర్తి చిన్న మాదిగ
ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ వ్యాఖ్యలపై.. మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న మాదిగ మండిపడ్డారు. శివాజీ ఎక్కడ సమావేశం జరిపినా.. 5 లక్షల మందితో అక్కడ సభ నిర్వహిస్తామన్నారు. ఆయనపై గతంలో వచ్చిన ఆపరోపణలపై విచారణ చేపట్టాలని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో డిమాండ్ చేశారు.
![కారెం శివాజా వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ మండిపాటు mrps fires on karem sivaji](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9594009-28-9594009-1605788586760.jpg)
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మార్పీఎస్ నేతలు
మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న మాదిగ.. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ మీద గతంలో అనేక ఆరోపణలు వచ్చాయని.. వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాదిగల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. శివాజీ సమావేశం ఎక్కడ జరిగినా.. 5 లక్షల మందితో అక్కడ సభ నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మార్పీఎస్ నేతలు
ఇదీ చదవండి:నేరస్థులతో వైకాపా నిండిపోయింది:ఎమ్మెల్సీ రామ్మోహన్