ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తహసీల్దార్​కు కరోనా.. కిందస్థాయి ఉద్యోగుల్లో ఆందోళన - mro tested corona positive in east godavari news

ఆత్రేయపురంలో తహసీల్దార్​కు కరోనా సోకడం కిందస్థాయి అధికారుల్లో కలకలం రేపింది. ఎమ్మార్వోకు శనివారం పరీక్షలు చేయగా వైరస్​ పాజిటివ్​ వచ్చినట్లు ఆత్రేయపురం వైద్యాధికారి తెలిపారు.

తహసీల్దార్​కు కరోనా.. కిందస్థాయి ఉద్యోగుల్లో ఆందోళనతహసీల్దార్​కు కరోనా.. కిందస్థాయి ఉద్యోగుల్లో ఆందోళన
తహసీల్దార్​కు కరోనా.. కిందస్థాయి ఉద్యోగుల్లో ఆందోళన

By

Published : Jul 12, 2020, 1:04 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో తహసీల్దార్​కి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు ఆత్రేయపురం పీహెచ్​సీ వైద్యాధికారి శ్రీనివాస్​ వర్మ తెలిపారు. శనివారం తహసీల్దార్​ నుంచి నమూనాలు సేకరించి.. పరీక్షించగా వైరస్​ పాజిటివ్​గా తేలినట్లు చెప్పారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తహసీల్దార్​ కార్యాలయం, పరిసరాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఇటీవల ఆయన క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించడం వల్ల కింది స్థాయి ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details