కరోనా మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కావాల్సిన వారికి కడచూపునూ లేకుండా చేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంలో దొంగర సుభధ్ర అనే వృద్ధురాలు బుధవారం మరణించింది. మృతురాలి కుటుంబంలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉండటంతో అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
విషయం తెలుసుకొన్న ఎంపీడీవో శ్రీలలిత ఉన్నతాధికారులతో మాట్లాడారు. గురువారం మధ్యాహ్నం ఎంపీడీవో.. తన సిబ్బందితో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.