ఎంపీ భరత్ ను నిలదీసిన ఎస్సీ సంఘాలు - rajamahendravaram siromundanam news
పోలీసుల దాష్టీకానికి గురైన సీతానగరం శిరోముండనం బాధితుడిని ఎంపీ మార్గాని భరత్ పరామర్శించారు. ఘటనకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ సంఘాల ప్రతినిధులు ఎంపీని డిమాండ్ చేశారు.
![ఎంపీ భరత్ ను నిలదీసిన ఎస్సీ సంఘాలు mp marghani bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8132386-167-8132386-1595434190543.jpg)
శిరోముండనం బాధ్యులపై చర్యలు తీసుకోండి:ఎంపీ భరత్ ను డిమాండ్ చేసిన ఎస్సీ సంఘాలు
శిరోముండనం బాధ్యులపై చర్యలు తీసుకోండి:ఎంపీ భరత్ ను డిమాండ్ చేసిన ఎస్సీ సంఘాలు
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధిత యువకుడు ప్రసాద్ ను ఎంపీ మార్గాని భరత్ ఆసుపత్రిలో పరామర్శించారు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకుంటుదని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు చేపడతాం అని అన్నారు. శిరోముండనం చేయించిన వ్యక్తులపై చర్యలు తీసు కునేందుకు హామీ ఇవ్వాలని ఎస్సీ సంఘాల ప్రతినిధులు ఎంపీని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.