తూర్పు రైల్వే ప్లాట్ ఫామ్ అభివృద్ధి చెందితే.. ప్రయాణికులతోపాటుగా నగరవాసులకు మరింత సౌకర్యంగా ఉంటుందని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. రాజమహేంద్రవరంలో తూర్పు రైల్వే పనులను అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. త్వరిగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్లాట్ ఫామ్‌ను పెంచటం ద్వారా రైళ్ల రాకపోకలు మరింత సులభం అవుతుందన్నారు. దీంతోపాటుగా తూర్పు ప్రాంతం అభివృద్ధికి ఇప్పుడు చేపట్టిన పనులు మరింతగా ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరంలో రైల్వే పనులు పరిశీలించిన ఎంపీ మార్గాని భరత్ - రాజమహేంద్రవరంలో రైల్వే అభివృద్ధి పనులు తాజా వార్తలు
రాజమహేంద్రవరంలో తూర్పు రైల్వే ప్లాట్ ఫామ్ పనులను ఎంపీ మార్గాని భరత్ పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
రైల్వే పనులు పరిశీలించిన ఎంపీ మార్గాని భరత్