ఫోర్త్ బ్రిడ్జి మరమ్మతు పనులు పూర్తయితే ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయాణం సులభతరం అవుతుందని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. ఫోర్త్ బ్రిడ్జి పూర్తయిన తరువాత వైఎస్సార్ వారధిగా నామకరణం చేస్తామని తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, దివాన్ చెరువు గామన్ బ్రిడ్జి రోడ్డు మరమ్మతు పనులు ముంబై నుంచి వచ్చిన సంజయ్ మిశ్రాతో కలిసి పరిశీలించారు. డిసెంబర్ 25 నాటికి ఒకవైపు రోడ్డు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం చేపట్టిన పనులు వల్ల టోల్ గేట్ వద్ద ఆదాయం పెరిగినట్లు వెల్లడించారు. ఈ పర్యటనలో పలువురు ప్రభుత్వ శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
రహదారి పనులను పరిశీలించిన మార్గాని భరత్ - రోడ్డు పనులు పరిశీలించిన ఎంపీ మార్గాని భరత్ తాజా వార్తలు
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం దివాన్ చెరువు గామన్ బ్రిడ్జి రోడ్డు మరమ్మతులు శరవేగంగా జరుగుతున్నాయి. ముంబై నుంచి వచ్చిన సంజయ్ మిశ్రాతో కలిసి ఎంపీ మార్గాని భరత్ ఈ పనులను పరిశీలించారు.

ఎంపీ మార్గాని భరత్