తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎంపీ మార్గాని భరత్ ప్రచార ఆటోలను ప్రారంభించారు. నగరమంతా 25 ఆటోలు తిరుగుతూ ప్రజలకు అవగాహన కలిగిస్తాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల సత్యనారాయణ, వైకాపా నాయకుడు శివరామసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. వివిధ శాఖల సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారని... ప్రజలందరూ ఇళ్ల వద్దే ఉండి కరోనా వ్యాప్తి చెందకుండా సహకరించాలని ఎంపీ కోరారు.
కరోనా ప్రచార ఆటోలను ప్రారంభించిన ఎంపీ భరత్ - రాజమహేంద్రవరంలో కరోనా ప్రచార ఆటోలు ప్రారంభం
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కరోనా అవగాహన ప్రచార ఆటోలను ఎంపీ మార్గాని భరత్ ప్రారంభించారు.
కరోనా ప్రచార ఆటోలను ప్రారంభించిన ఎంపీ మార్గాని భరత్