రాజమండ్రి గోదావరి బ్రిడ్జి లిమిటెడ్ పేరిట రహదారిని నిర్మిస్తామని ఎంపీ మార్గాని భరత్ ప్రకటించారు. రాజమహేంద్రవరం-కొవ్వూరు గామన్ వంతెన అనుసంధానిస్తూ... ఈ రోడ్డును నిర్మించనున్నారు. విస్తారంగా కురిసిన వర్షాలకు ఈ మార్గం దెబ్బ తినటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా భరత్ అధికారులతో కలిసి ఈ వంతె పునర్నిర్మాన పనులకు శంకుస్థాపన చేశారు.
రాజమహేంద్రవరం-కొవ్వూరు గామన్ వంతెన పునర్నిర్మాణం - Rajahmundry-Kovvur Gaman bridge latest
రాజమహేంద్రవరం-కొవ్వూరు గామన్ వంతెన అనుసంధాన రహదారిని పునర్నిర్మించనున్నట్లు ఎంపీ మార్గాని భరత్ ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతిని... వాహనదారులను నరకయాతనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ రహదారి నూతన నిర్మానానికి ఎంపీ శంకుస్థాపన చేశారు.
రాజమహేంద్రవరం-కొవ్వూరు గామన్ వంతెన నిర్మాణం
పన్నెండున్నర కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తామని భరత్ చెప్పారు. అలాగే రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారిపై వివిధ పైవంతెనల నిర్మాణాలకు త్వరలోనే టెండరు పిలుస్తామని తెలిపారు.
ఇదీ చదవండీ...రాష్ట్రానికి 'కైనెటిక్' పరిశ్రమ