వాహన నిబంధనల ఉల్లంఘన జరిమానాలు భారీగా పెంచే ముందు ప్రభుత్వం తమ బాధ్యతగా రోడ్లను సక్రమంగా వేయాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు. రోడ్లు బాగోలేనప్పుడు టోల్ ఎందుకు వసూలు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ప్రభుత్వం ముందుగా రోడ్డు సక్రమంగా వేసి చూపాలన్నారు.
'జరిమానాలు పెంచే ముందు.. రోడ్లు సక్రమంగా వేయాలి'
వాహన నిబంధనల ఉల్లంఘన జరిమానాలు పెంచే ముందు ప్రభుత్వం రోడ్డు సరిగ్గా వేయాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు.
ఎంపీ హర్ష కుమార్
విజయవాడ, రాజమహేంద్రవరం రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని హర్షకుమార్ అన్నారు. రాజమహేంద్రవరం దివాన్ చెరువు ఫోర్త్ బ్రిడ్జి మీదుగా ముఖ్యమంత్రి కాన్వాయ్ రాజమహేంద్రవరం నుంచి కొవ్వూరు సక్రమంగా చేరుకుంటే.. తాను రాజకీయాల నుంచి తప్పుకోమన్న తప్పుకుంటానని హర్షకుమార్ సవాలు విసిరారు.
ఇదీ చదవండి: వాహన నిబంధనలు ఉల్లంఘిస్తే.. భారీ మూల్యం తప్పదు