తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పర్యటించారు. కోనసీమలో కొత్త కేసులు వచ్చాయని..పాజిటివ్ వచ్చిన వారు ఈ ప్రాంతాలకు చెందినవారు కాదని... ఇతర ప్రాంతాలవారికి తెలిపారు. ప్రజలంతా బయటకు వచ్చిన సమయంలో కచ్చితంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని వారు సూచించారు. లాక్డౌన్ నిబంధనలు ప్రభుత్వం సడలించిందని అయితే.. కొత్త కేసులు వచ్చిన క్రమంలో ఆయా ప్రాంతంలో లాక్డౌన్ నిబంధనలు కఠినం చేశామని తెలిపారు. ప్రజలంతా ప్రభుత్వ అధికారులకు సహకరించాలని కోరారు.
ప్రజలంతా సహకరించండి: ఎంపీ చింతా అనురాధ - ఎంపీ చింతా అనురాధ తాజా వార్తలు
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కోరారు.
![ప్రజలంతా సహకరించండి: ఎంపీ చింతా అనురాధ mp chintha anuradha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7170981-329-7170981-1589292058092.jpg)
mp chintha anuradha