ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 30, 2020, 1:36 PM IST

Updated : May 30, 2020, 5:18 PM IST

ETV Bharat / state

'రైతుకు అన్ని సదుపాయాలు ఒకేచోట కల్పిస్తాం'

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో రైతు భరోసా కేంద్రాన్ని.. ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. సీఎం జగన్ రైతుల కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. వీటి ద్వారా అన్నదాతలు ఎలాంటి సహాయమైనా పొందవచ్చని తెలిపారు.

mp chintha anuradha opened raithu bharosa centre in raavulapalem east godavari district
రావులపాలెంలో రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన ఎంపీ అనురాధ

రైతుకు అన్ని సదుపాయాలు ఒకేచోట కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ చింతా అనురాధ అన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డితో కలిసి రావులపాలెంలో ఆమె రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. కోనసీమలోని 16 మండలాల రైతులు దీని ద్వారా వ్యవసాయానికి సంబంధించి ఏ సహాయమైనా పొందవచ్చన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని అనురాధ తెలిపారు. ఆయా కేంద్రాల్లో కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేశారని.. వాటి ద్వారా రైతులు ఎరువులు ఎంపిక చేసుకోవచ్చని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ప్రారంభం సందర్భంగా వ్యవసాయ శాఖ సిబ్బంది కూరగాయలు, పువ్వులతో వేసిన కళాకృతి ఎంతో ఆకట్టుకుంది. అలాగే పకృతి వ్యవసాయం ఎంతో మేలని తెలుపుతూ చిరుధాన్యాలతో వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి.

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు అన్నారు. అంబాజీపేట, నేదునూరు, నరేంద్రపురం, గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించారు. విత్తనాలు మొదలుకొని ఎరువులు, పురుగు మందులు అన్ని రైతులకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఈ కేంద్రాల వద్ద లభిస్తాయని తెలిపారు.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అనంత ఉదయభాస్కర్ అన్నారు. రంపచోడవరం మండలం జగరంపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. నియోజకవర్గానికి 77 కేంద్రాలు మంజూరయ్యాయని వారు అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 42 కేంద్రాలు, చింతూరు ఐటీడీఏ పరిధిలో 35 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి..

భయాందోళనలో ఓడలరేవు వాసులు

Last Updated : May 30, 2020, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details