అమలాపురం నుంచి బెండమూర్లంక వరకు ఆర్అండ్బీ రహదారి అభివృద్దికి రూ.12 కోట్లు విడుదలైనట్లు ఎంపీ చింతా అనురాధ వెల్లడించారు. రహదారుల సమస్యను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించినట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు అల్లవరం మండలం గోడిలంక గ్రామం వద్ద సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌తో కలిసి ఆమె రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అనురాధ..కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి విశ్వరూప్ అన్నారు.
రహదారి పనులకు ఎంపీ చింతా అనురాధ శంకుస్థాపన - amalpuram latest updates
అమలాపురంలో ఆర్అండ్బీ రహదారి అభివృద్ధి పనులకు ఎంపీ చింతా అనురాధ శంకుస్థాపన చేశారు. రోడ్ల నిర్మాణానికి రూ.12 కోట్ల నిధులు మంజూరు చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ చింతా అనురాధ