తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయాన్ని ఎంపీ భరత్ రామ్ సందర్శించారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన థర్మల్ స్క్రీనింగ్‌లో ఉష్ణోగ్రతను పరీక్షించుకున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ విమానాశ్రయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఎయిర్ పోర్టు డైరెక్టర్‌తో చర్చించినట్లు చెప్పారు. ఎయిర్ పోర్ట్‌లో ఆక్సిజన్ కొరత ఏర్పడితే తక్షణ రవాణాకు మధురపూడి ఎయిర్ పోర్ట్‌లో ఐఎల్ సెవెన్ సిక్స్ విమానం అందుబాటులో ఉందన్నారు. అలాగే ఆక్సిజన్ సరఫరాకు వినియోగించే భారీ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు రన్ వే అనుకూలంగా ఉందన్నారు. విమానాశ్రయంలో విధులు నిర్వర్తించే వారందరికీ కరోనా వ్యాక్సినేషన్ వేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
రాజమహేంద్రవరం విమానాశ్రయాన్ని సందర్శించిన ఎంపీ భరత్ రామ్ - ఎంపీ భరత్ తాజా వార్తలు
ఎంపీ భరత్ రామ్ రాజమహేంద్రవరం విమానాశ్రయాన్ని సందర్శించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడ తీసుకుంటున్న చర్యలను డైరెక్టర్‌తో చర్చించారు.
రాజమహేంద్రవరం విమానాశ్రయాన్ని సందర్శంచిన ఎంపీ భరత్ రామ్