ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెుక్కల పెంపకం బాధ్యత.. విద్యార్థులదే: ఎంపీ భరత్ - yuvatha haritha program updates

యువత - హరిత పేరిట చేపట్టే మొక్కల పెంచే బాధ్యతల్ని విద్యార్థులకు అప్పగిస్తామని... ఎంపీ భరత్ అన్నారు. నాటిన మెుక్కల వద్ద.. ఆ మెుక్క నాటిన విద్యార్థి నామఫలకం ఉంటుందని స్పష్టం చేశారు.

mp bharat
ఎంపీ భరత్

By

Published : Feb 27, 2021, 2:13 PM IST

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మార్చి 1 నుంచి.. మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎంపీ మార్గాని భరత్ వెల్లడించారు. యువత - హరిత పేరిట చేపట్టే మొక్కల పెంపకం బాధ్యతల్ని విద్యార్థులకు అప్పగిస్తామని చెప్పారు.

రాజమహేంద్రవరంలో కాలుష్యం పెరిగిపోతున్నందున... అభివృద్ధి చేసిన రహదారుల వద్ద ఒక్కో మొక్క నాటుతామన్నారు. ఒక్కో రోడ్డును ఒక్కో కళాశాలకు అప్పగించి.... మొక్కల పెంపకంపై అవగాహన కోసం 2కే, 5కే రన్ నిర్వహిస్తామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details