రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎంపీ భరత్ యాగం
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్ యాగం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని యాగం జరిపిస్తున్నామని ఎంపీ తెలిపారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎంపీ భరత్ యాగం
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ... రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్ యాగం నిర్వహించారు. ధన్వంతరీ సహిత మహా సుదర్శన యాగం, రాజశ్యామల రాజమాతంగి సహిత రుద్రయాగాలు చేపట్టారు. ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లాలనే యాగాలు నిర్వహించినట్లు ఎంపీ తెలిపారు. యాగ కార్యక్రమాలు మూడు రోజులపాటు కొనసాగుతాయని వివరించారు.