ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి పనులు పరిశీలించిన ఎంపీ - రాజమండ్రి బ్రిడ్జిని పరిశీలించిన ఎంపీ భరత్

రాజమహేంద్రవరం రోడ్డు కమ్ రైలు వంతెన ట్రాక్ ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయని ఎంపీ భరత్ తెలిపారు. కొత్తగా నిర్మించిన ట్రాక్​ను ఆయన పరిశీలించారు.

mp bharat visit road cum rail bridge in rajamahendravaram
ఎంపీ భరత్

By

Published : Jun 1, 2020, 4:21 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రోడ్డు కమ్ రైలు వంతెనలో ట్రాక్ ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయని ఎంపీ మార్గాని భరత్‌ వెల్లడించారు. రైలు వంతెనపై ప్రయాణించి పున:నిర్మాణ పనులను పరిశీలించారు. లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకొని, 36 గంటల్లో రైల్వేశాఖ వీటిని పూర్తి చేశారన్నారు. 1977 తర్వాత గోదావరి నదిపై రైలు ట్రాక్‌ పూర్తిస్థాయి ఆధునికీకరణ పనులు చేయడం ఇదే తొలిసారి అని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details