రాష్ట్ర పర్యటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గోదావరిలో పర్యటకుల కోసం బోటింగ్‌ను రాజమహేంద్రవరం వద్ద ఎంపీ భరత్ పునః ప్రారంభించారు. గతేడాది సెప్టెంబరులో జరిగిన కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత గోదావరిలో పర్యటక బోటింగ్‌ను పూర్తిగా నిలిపివేయగా.. ఆదివారం తిరిగి మొదలుపెట్టారు. అన్నిరకాల రక్షణ చర్యలు తీసుకున్నట్టు ఎంపీ తెలిపారు. ఫిబ్రవరి 20వ తేదీ నాటికి పర్యటకుల కోసం కంట్రోల్ రూంను ఏర్పాటు చేయడమే కాకుండా, పెట్రోలింగ్ బోటులను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గోదావరిలో మళ్లీ బోటింగ్.. ప్రారంభించిన ఎంపీ భరత్ - mp bharat reopened boating in rajamahendravaram
కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత గోదావరిలో నిలిచిపోయిన బోటింగ్.. ఇన్నాళ్లకు మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఎంపీ భరత్ చేతుల మీదుగా కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యటక అభివృద్ధి సంస్థ బోటింగ్ ప్రారంభించింది.
గోదావరిలో బోటింగ్ పునః ప్రారంభించిన ఎంపీ భరత్