స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందజేసిన 12 ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, శానిటైజర్లను రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రామ్ ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రికి అందజేశారు. చిట్టూరి శేషమాంబ ట్రస్ట్ ఆక్సిజన్ సిలెండర్లు, హైదరాబాద్కు చెందిన దాత అనిల్ కుమార్ రెడ్డి మాస్కులు, శానిటైజర్లు అందించారు. విపత్కర పరిస్థితుల్లో కొవిడ్ బాధితుల్ని ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావడం శుభపరిణామని ఎంపీ అన్నారు.
ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేసిన ఎంపీ భరత్ - mp bharath distributes oxyzen cylinders
రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రామ్ ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితులను ఆదుకోడానికి పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకురావడం శుభ పరిణామమని చెప్పారు.
ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేసిన ఎంపీ భరత్