తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్లో నాలుగు మృతదేహాలను తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్లాస్టిక్ కవర్లలో సీల్ చేసి ట్రాక్టర్లో మృతదేహాలను తరలిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ సృష్టించాయి.
పలు అనారోగ్య కారణాలతో మరణించిన వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. జీజీహెచ్ అధికారుల విజ్ఞప్తి మేరకు దహన సంస్కారాల నిర్వహణకు అనుమతించినట్లు చెప్పారు. మహాప్రస్థానం వాహనంలో మృతదేహాలను శ్మశానవాటికకు తరలిస్తామని జీజీహెచ్ సూపరింటెండెంట్ మహాలక్ష్మి తెలిపారు. ట్రాక్టర్లో తీసుకెళ్లిన ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు.