Mother and Son Died in Road Accident : తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న తల్లి కుమారులను ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన వీరిని ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు నిలవలేదు. తల్లి కుమారుల మరణంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండ్రాజవరం మండలం కె. సావరం గ్రామానికి చెందిన నార్ని పవన సూర్య గణేష్(22), అతని తల్లి వెంకట సత్యవతి(51) పనిమీద ముప్పవరనికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు నిడదవోలు మండలం కలవచర్ల వద్దకు రాగానే.. ఎదురుగా వస్తున్న కారు వీరిని వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ కుమారులకు తీవ్ర గాయాలయ్యాయి.