కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఒక్కరోజే 54,964 మంది దర్శించుకున్నారు. ఆలయానికి 11 లక్షల ఆదాయం సమకూరింది. ఏడు శనివారాల నోము సందర్భంగా... రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామిసేవలో పాల్గొన్నారు.
సాధారణ దర్శనం 44,369, ప్రత్యేక దర్శనం 10,595, మొత్తం 54,964 మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా ఆదాయం రూ.5,29,750, అన్నప్రసాద విరాళం ఆదాయం రూ.2,64,010, సేవలు, ఆదాయం రూ.27,025, లడ్డూ ఆదాయం రూ.2,96,640, విరాళాలు రూ.30,376, మొత్తం రూ.11,47,801లు ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.