తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో భద్రత మరింత కట్టుదిట్టం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రూ. 10.85 లక్షలతో ఆలయ ప్రాంగణంలో మరో 102 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.
టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఛైర్మన్ రోహిత్ అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. అజెండాలోని 18 అంశాలతో పాటు, ఆలయానికి సంబంధించిన మిరిన్ని కీలక విషయాలపైనా చర్చించారు.